తెలుగు భాషా వికాసాలకు పుట్టినిల్లు తెలంగాణ. తెలంగాణ అంటే తెలుగు ప్రజలు నివసించే ప్రదేశం అని అర్థం. రెండున్నరవేల వసంతాల తెలుగు వెన్నల సోన మన తెలంగాణ. అలనాటి హాలుని గాథా సప్తశతిలో అల్లనల్లన అల్లుకున్న తెలుగు పదదీప్తి కాలగమనంలో దశ దిశల ప్రసరించింది. ఈ పదరూపాలు చారిత్రిక జీవనాన్ని అక్షరబద్ధం చేసిన శాసనాలైనాయి. అందమైన అలంకారాలు ధరించి హృద్యమైన పద్య కావ్యాలైనాయి. తెలంగాణ అన్ని సాహిత్య ప్రక్రియలకు ఆదిగా నిలిచింది. తొలి అలంకార గ్రంథాన్ని సంతరించింది. ఎలుగెత్తి పాడుకునే ద్విపదనందించింది. తెలుగు స్వతంత్ర కావ్యం, శతకం, ద్విపద రామాయణం, అచ్చ తెలుగు కావ్యం, యక్ష గానం, సాంఘిక చరిత్రం అన్నిటికీ తొలిరూపు దిద్దింది. ఆధునిక ప్రక్రియలైన వచనకవిత, కథ, నవల అన్నిటిలో తనదైన జీవనాన్ని చిత్రించింది. కొలమానాలకందని సాహిత్య సంపదతో కొలువుదీరింది.
తెలుగు భాష గొప్పది : రాష్ట్రపతి కోవింద్
తెలుగు భాష గొప్పది : రాష్ట్రపతి కోవింద్